ముఖ్యమంత్రి
జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11
గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో
అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
అలాగే
ఇతర కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదించిన పెట్టుబడుల
ప్రాజెక్టులను కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదించనున్నట్లు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్
శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి జరగనున్నాయి.
మూడు నుంచి ఐదు
రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశముంది. ఏప్రిల్ లో అసెంబ్లీకి ఎన్నికలు జరిగే
అవకాశం ఉండటంతో ఈ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఎన్నికల తర్వాత పాలకపార్టీ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.