Parliament Budget Session to start from today
ప్రస్తుత పార్లమెంటు ఆఖరి బడ్జెట్ సమావేశాలు
మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతాయి. ఈ ఉదయం 11 గంటలకు సమావేశాలు మొదలవుతాయి. రాష్ట్రపతి
ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
2024-25 సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను కేంద్ర
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు అంటే గురువారం సభముందు ఉంచుతారు. ఈ సారి
ఆర్థిక సర్వే నివేదిక విడుదల చేయడం లేదని కేంద్రప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
నేడు, రేపు ఉభయ సభల్లో జీరో అవర్, క్వశ్చెన్ అవర్ జరగబోవు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ ఫిబ్రవరి
2న జరుగుతుంది. దానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ జవాబిస్తారు.
నిర్మలా సీతారామన్ జమ్మూకశ్మీర్ బడ్జెట్‌ను కూడా లోక్‌సభలో
ప్రవేశపెడతారు. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో
ఆ ప్రాంత బడ్జెట్‌ను కూడా కేంద్ర ఆర్థిక మంత్రే లోక్‌సభకు సమర్పిస్తారు.
పార్లమెంటు ఎన్నికలకు
ముందు ఆఖరి సమావేశాలు కావడంతో అధికార, ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి.
కేంద్రం ఓటాన్ అకౌంట్ సహా 19 బిల్లులను సభముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది. గత సెషన్‌లో
సస్పెండ్ అయిన 100మంది లోక్‌సభ, 46మంది రాజ్యసభ ఎంపీలలో ముగ్గురు లోక్‌సభ, 11మంది
రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ తొలగించారు.