రేషన్
డీలర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం తక్ష చర్యలు చేపట్టాలని బీజేపీ
రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి డిమాండ్ చేశారు. రేషన్ బియ్యం పంపిణీని తమ ఘనతగా
వైసీపీ చెప్పుకొవడం సరికాదన్నారు. కేంద్ర పథకాన్ని తమదిగా చెప్పుకుంటూ ఓట్ల లబ్ధి
కోసం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వం అమలు చేస్తోందనే
విషయం ప్రజలకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని డీలర్లకు పురందరేశ్వరి
సూచించారు.
తమ
సమస్యల పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, న్యాయం జరిగేలా చూడాలంటూ
పురందరేశ్వని రేషన్ డీలర్లు కోరారు. రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుడు దివ్వి లీలా
మాధవరావు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఆహార భద్రతా చట్టానికి విరుద్ధంగా
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న మొబైల్ బియ్యం పంపిణీ విధానాన్ని రద్దు చేయాలని
వినతిపత్రంలో పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారానికి బీజేపీ సహకారాన్ని
కోరుతున్నామన్నారు.
రేషన్
డీలర్లకు ఏడున్నర వేలు గౌరవ వేతనం, క్వింటాల్ కు రూ. 150 కమీషన్ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని
మాధవరావు పేర్కొన్నారు.
కార్యక్రమంలో
రేషన్ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా వెంకటరమణ, గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.