స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఉదయం ప్రారంభంలోనే నష్టాలతో మొదలయ్యాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్ట నుంది. ఎన్నికలకు ముందు బడ్జెట్ కావడంతో పరిశ్రమలకు పెద్దగా సానుకూలంగా ఉండకపోవచ్చనే అంచనాలున్నాయి. గురువారం రోజు అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు కూడా ప్రకటించనుంది. పెట్టుబడిదారులు ముందే అప్రమత్తమయ్యారు.
సెన్సెక్స్ 801 పాయింట్ల నష్టంతో 71139 వద్ద ముగిసింది. నిఫ్టీ 229 పాయింట్లు నష్టపోయి, 21508 వద్ద క్లోజైంది. సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో (sensex bse nse nifty) బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఎస్‌బీఐ, హిందుస్థాన్ యూనిలీవర్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా షేర్లు లాభాలార్జించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు స్వల్పంగా దిగి వచ్చాయి. బ్యారెల్ ముడిచమురు ధర 82.58 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఔన్సు గోల్డ్ 2034 డాలర్లకు పెరిగింది.