కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ చండీగఢ్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. చండీగఢ్ మేయర్ స్థానం బీజేపీ గెలుచుకుంది. ఇవాళ జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోన్కర్ విజయం సాధించారు. ఆమ్ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు కలసి పోటీ చేసినా మేయర్ పీఠం దక్కించుకోలేకపోయాయి.
హైకోర్టు ఆదేశాల మేరకు చండీగఢ్‌లో ఇవాళ మేయర్ ఎన్నికలు నిర్వహించారు. ఆప్ మేయర్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌పై బీజేపీ నాయకుడు మనోజ్ సోస్కర్ విజయం (chandigarh mayor elections results) సాధించారు. డిప్యూటీ మేయర్ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.
సార్వత్రిక ఎన్నికల ముందు చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో గెలుపు బీజేపీ నేతలకు ఊపుతెచ్చింది.దీని ప్రభావం ఇండీ కూటమిపై పడే అవకాశం కూడా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ నేతలు ఇప్పటికే ప్రకటన చేశారు. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కూడా ఇండీ కూటమికి దూరంగా జరిగింది. బిహార్‌లో నితీశ్ కుమార్ బీజేపీతో జట్టుకట్టిన విషయం తెలిసిందే.