పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. తోషాఖానా కేసులో ఇమ్రాన్‌కు (pakistan ex prime minister imran khan) గతంలో ట్రయల్ కోర్టు విధించిన శిక్షణను ఇస్లామాబాద్ హైకోర్టు నిలిపేసింది. వెంటనే సైఫర్ కేసులో ఇమ్రాన్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రావల్సిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు.
సైఫర్ కేసులో పాక్ పెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ గత సంవత్సరం సెప్టెంబరులో ఇమ్రాన్ ఖాన్, ఖురేషీలపై ఛార్జిషీట్ వేసింది. భద్రతా కారణాల వల్ల వారిని న్యాయమూర్తి అబ్దుల్ జైల్లోనే విచారించారు. తాజాగా వారికి పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. పాక్‌లో ఎన్నికలు జరుగుతున్న వేళ ఇమ్రాన్ ఖాన్‌కు జైలు శిక్ష విధించడం గమనార్హం. ఇమ్రాన్ సన్నిహితుడు షా మహ్మద్ ఖరేషీకి కూడి శిక్ష పడినట్లు పాక్ మీడియా ప్రసారం చేసింది.