ఉత్తర
కాశీలోని సిల్క్యారా సొరంగ నిర్మాణ పనులు మళ్ళీ ప్రారంభమయ్యాయి. గతేడాది సొరంగం కూలిన
ఘటన తర్వాత పనులు నిలిపివేశారు. దాదాపు రెండు నెలల విరామం తర్వాత పనులు ప్రారంభించేందుకు
జాతీయరహదారుల శాఖ అనుమతి ఇవ్వడంతో సిల్క్యారా వద్దకు కార్మికులు చేరుకుంటున్నారు.
సొరంగం
కూలిన ఘటనలో 17 రోజుల పాటు శిథిలాల్లో చిక్కుకుని బయటపడిన కార్మికుల్లోని కొందరు మళ్ళీ
నిర్మాణ పనుల్లో భాగస్వాములయ్యారు.
బెంగాల్‌కు
చెందిన మాణిక్ తాలుక్ధార్ అనే కార్మికుడు సొరంగం పనుల్లో చేరాడు.
గతంలో సొరంగం
కూలినప్పుడు శిథిలాల్లో చిక్కుకుపోయి, 17 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడిన 41 మంది
కార్మికుల్లో ఇతను కూడా ఒకరు.
‘విధిరాత
ఎలా ఉంటి అలా జరుగుతుంది. భయపడుతూ కూర్చోలేం, భయం మాని పని చేయడమే’’ నని సదరు
కార్మికుడు స్పందించాడు.
17
రోజుల పాటు సరైన తిండి, విశ్రాంతి లేకుండా ప్రాణభయంతో దుర్భర పరిస్థితులు అనుభవించినప్పటికీ మళ్ళీ పనిలో చేరేందుకు కించంత
కూడా వెనుకాడ లేదు. తాము చేసే పనిలో సవాళ్ళు ఎదుర్కోవడం కొత్తేం కాదని, అన్నింటిని
అధిగమించి ముందుకు సాగడమేనంటూ తోటి కార్మికుల్లో ధైర్యం నింపుతున్నాడు.
మాణిక్
బాటలో మరికొందరు కూడా తిరిగి పనిలో చేరారు. ప్రమాదం జరుగుతుందేమోనని భయంతో పనిచేయకుండా
ఉండలేమన్నారు. మరిన్ని కట్టుదిట్టమైన రక్షణ చర్యలతో ముందుకు సాగుతామన్నారు. పనిలో
చేరిన తర్వాత ఇప్పటి వరకు ఉన్న భయాందోళనలు తొలిగిపోయాయన్నారు. మిగతా కార్మికులతో కూడా తాము మాట్లాడామని, వారంతా మళ్ళీ పనుల్లో పాల్గొంటారని ఆకాంక్షించారు.
సొరంగ
నిర్మాణ ప్రదేశం వద్ద ఇప్పటికే రక్షణ చర్యలను మెరుగుపరిచారు. ప్రమాదం జరిగినప్పుడు
కార్మికులు సులువగా బయటపడే మార్గాలను ఇరువైపులా ఏర్పాటు చేశారు.
నిర్మాణ
కార్మికులంతా ఉపాధి కోసం వలస వచ్చినవారే.
వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి సొరంగ పనుల్లో పాల్గొంటున్నారు.