శ్రీశైల
శ్రీభ్రమరాంబా, మల్లికార్జునస్వామి వార్లకు ఓ భక్తుడు బంగారు, వెండి పుష్పాలు కానుకగా
సమర్పించి తన భక్తిని చాటుకున్నాడు. 82 గ్రాముల బంగారంతో తామర పువ్వుల ఆకారంలో 8
పుష్పాలు, 40 గ్రాముల వెండితో 110 చిన్న పుష్పాలు తయారు చేయించి స్వామివార్లకు
అందజేశారు. వీటి విలువ రూ. 5.45 లక్షలు ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ కు చెందిన మురళి అనే భక్తుడు కుటుంబ సమేతంగా అమ్మవారు, స్వామిని
దర్శించుకన్న అనంతరం అధికారులు ఈ కానుకలు అందజేశారు. సదరు భక్తుడికి వేదాశ్వీరచనం
అందజేసిన పండితులు, స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
సికింద్రాబాద్
కు చెందిన రాణి కన్స్ట్రక్షన్స్ సంస్థ యజమాని గుల్ల గుండయ్య అనే భక్తుడు, శ్రీగిరికి
భారీ విరాళాన్ని కానుకుగా అందించారు. దేవస్థాన పరిధిలోని ఆస్పత్రికి బయో కెమిస్ట్రీ
అనలైజర్, గో శాల నిర్వహణకు రూ. 5 లక్షలు, నిత్యాన్నదాన పథకానికి రూ. 25 లక్షలు
అందజేశారు. సదరు భక్తుడిని కూడా ఆలయ అధికారులు సత్కరించగా, పండితులు ఆశీర్వదించారు.
ఆదిదంపతుల శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు