అమెరికాలో మరో అరాచకం వెలుగుచూసింది. అమెరికాలోని లిథోనియా నగరంలో వివేక్ సైనీ అనే భారత విద్యార్థి దారుణ హత్యకు ( america crime news) గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం… జూలియన్ సాల్క్నర్ అనే డ్రగ్గిస్ట్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. లిథోనియా నగరంలో వివేక్ సైనీ ఓ దుకాణంలో ఉద్యోగం చేస్తున్నాడు. వీధుల వెంట తిరిగే జూలియన్ దురవస్థ చూసి జాలిపడి, అతనికి ప్రతి రోజూ ఆహారం ఇవ్వడం మొదలు పెట్టాడు. చలికి తట్టుకునేందుకు దుస్తులు కూడా అందించాడు.
జనవరం 16న దుకాణం మూసివేసినాక జూలియన్ వచ్చాడు. అప్పటికే షట్టర్ మూసేయడంతో వెళ్లిపోవాలని వివేక్ సైనీ చెప్పడంతో జూలియన్ రెచ్చిపోయాడు. సమీపంలో ఉన్న సుత్తితో వివేక్ సైనీ తలపై 50 సార్లు కొట్టి చంపాడు.ఈ దారుణం సీసీటీవీల్లో రికార్డైంది. ఇటీవలే ఎంబీఏ పూర్తి చేసుకున్న వివేక్ సైనీ దారుణ హత్యతో హర్యానాలోని వారి తల్లిదండ్రుల ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు