మనిషి మెదడులో అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు చిప్ అమర్చారు. న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఈ విషయం వెల్లడించారు.మెదడులో చిప్ పెట్టించుకున్న వ్యక్తి వేగంగా కోలుకుంటున్నాడని మస్క్ (elon musk) ప్రకటించారు. అతని నుంచి స్పష్టమైన న్యూరాన్ స్పైక్ డిటెక్షన్‌ను గుర్తించినట్లు డాక్టర్లు తెలిపారు.
మనిషి మెదడుతో కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ ప్రయోగాలకు అమెరికా గత ఏడాది అనుమతులిచ్చింది. ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ చిప్‌ను కోతులు, పందుల్లో విజయవంతంగా అమర్చింది. తాజాగా మనిషిలో కూడా అమర్చారు. దీని ఫలితాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
మెదడు, కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లో 8మి.మీ వ్యాసం కలిగిన ఎన్1 అనే చిప్ ఉంటుంది. దానిలో ఎలక్ట్రోడులు ఉంటాయి. వెంట్రుక మందంలో 20వ వంతు మాత్రమే ఉంటాయి. పుర్రెలో సన్నని మార్గం ఏర్పాటు చేసి అక్కడ నుంచి మెదడులో చిప్ ఏర్పాటు చేస్తారు. ఒక్కో మనిషిలో పది చిప్‌ల వరకు అమర్చవచ్చు. ఈ చిప్ మెదడు నుంచి విద్యుత్ సంకేతాలు పంపడం,సంకేతాలు అందుకోవడం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.