దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలార్జించాయి. ఉదయం ప్రారంభంలోనే లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు (sensex bse nse nifty )ముగిసే సమయానికి భారీ లాభాలార్జించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 1200 పాయింట్లు పెరిగి 71941 వద్ద ముగిసింది. నిఫ్టీ 385 పాయింట్లు పెరిగి 21737 వద్ద క్లోజైంది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో ఇన్ఫీ, ఐటీసీ, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు నష్టాలను చవిచూడగా మిగిలిన అన్ని కంపెనీల షేర్లు లాభాలార్జించాయి. ముడిచమురు బ్యారెల్ 83.35 డాలర్లకు దిగి వచ్చింది. ఔన్సు బంగారం 2027 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. పెట్టుబడిదారులు భారీగా కొనుగోళ్లకు దిగడంతో స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి.