మనీలాండరింగ్ కేసులో విచారించేందుకు ఈడీ అధికారులు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇంటికి చేరుకున్నారు. ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో హేమంత్ సోరెన్‌ను (ed case) విచారించనున్నారు. ఓ భూ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసును సీఎం ఎదుర్కొంటున్నారు. జనవరి 29 లేదా 31న అందుబాటులో ఉండాలని గతంలోనే ఈడీ అధికారులు సీఎంకు నోటీసులు పంపించారు.
ఈనెల 27 నుంచి 31లోపు ఎప్పుడైనా తమ కార్యాలయంలో హాజరు కావాలని ఈడీ అవకాశం కల్పించింది. అయితే దీనిపై ఇంత వరకు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందించలేదు. దీంతో ఈడీ అధికారులే నేరుగా సోరెన్ ఇంటికి చేరుకున్నారు. ఈ కేసులో జనవరి 20న రాంచీలోని సీఎం నివాసంలో ఈడీ అధికారులు హేమంత్ సోరెన్ వాంగ్మూలం నమోదు చేశారు. దాదాపు ఏడు గంటలు ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఈడీ అధికారులు సోరెన్‌కు తొమ్మిది సార్లు నోటీసులు జారీ చేశారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు