అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. చంద్రబాబుకు లభించిన ముందస్తు బెయిల్ రద్దుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసులో సహ నిందితులకు కూడా ఈ తీర్పు వర్తిస్తుందని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు. 2022లో కేసు ఎస్ఎల్పీ దాఖలైంది. ఈ కేసుకు 17ఏ నిబంధన వర్తిస్తుందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
చంద్రబాబుపై ఇప్పటికే ఉన్న ఇతర కేసుల వివరాలను న్యాయమూర్తి తెప్పించుకున్నారు. ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూద్రా ధర్మాసనానికి అన్ని వివరాలు అందించారు. చంద్రబాబుకు కొన్ని కేసులో బెయిల్, మరికొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ వచ్చిందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. అమరావతి ఇన్నర్‌రింగు రోడ్డు కేసులో (amaravati innerring road case) సహ నిందితులంతా బయటే ఉన్నారు. చంద్రబాబు బయట ఉంటే నష్టమేమిటని న్యాయమూర్తి ప్రశ్నించినట్లు తెలుస్తోంది.