ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి భద్రత పెరిగింది. మహారాష్ట్రలోని నాగపూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై ఇక నుంచి డ్రోన్లు ఎగురవేయడాన్ని నిషేధించారు. ఆ ప్రాంతాన్ని నో డ్రోన్ జోన్‌గా ప్రకటించారు. భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో ఫోటోలు, వీడియోలు తీయడం, డ్రోన్లు ఎగురవేయడాన్ని నిషేధించారు.మార్చి 28 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.
నాగపూర్ మహల్ ఏరియాలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ఉంది. చుట్టూ హోటళ్లు, కోచింగ్ కేంద్రాలు, లాడ్జీలున్నాయి. నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడ ఫోటోలు, వీడియోలు తీసే అవకాశముండటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి ఇటీవల బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ప్రాంతంలో సీఆర్‌పీసీ సెక్షన్ 144 (1)(3) ఉత్తర్వులు అమల్లో ఉంటాయని సిటీ సంయుక్త పోలీస్ కమిషనర్ అశ్వతి డోర్జే వెల్లడించారు. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలుంటాయని హెచ్చరించారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు