దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు పరుగులు పెడుతున్నాయి. సోమవారం ప్రారంభంలోనే సెన్సెక్స్ భారీ లాభాలతో ప్రారంభమైంది. ప్రారంభంలోనే 610 పాయింట్ల లాభంతో 71307 వద్ద మొదలైన సెన్సెక్స్, (bse nse stock markets) భారీ లాభాలను నమోదు చేసింది. నిఫ్టీ 192 పాయింట్లు పెరిగింది. 21543 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.83.15గా ఉంది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్, విప్రో, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాలార్జించాయి. ఐటీసీ, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, జేఎస్‌డబ్లూ స్టీల్ కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి.
ముడిచమురు ధరలు భారీగా దిగిరావడం, ఆసియా మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు దూకుడు ప్రదర్శించాయి.శుక్రవారం లాభాల స్వీకరణకు దిగిన పెట్టుబడిదారులు, ఇవాళ కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు.