ప్రపంచ కుబేరుల జాబితాలో అందరిని వెనక్కునెట్టి బెర్నార్డ్ ఆర్నాల్డ్ నెంబర్ వన్‌గా నిలిచారు. విలాస వస్తువులు విక్రయించే ఎల్వీఎంహెచ్ ఛైర్మన్, సీఈవోగా వ్యవహరిస్తోన్న ఆర్నాల్డ్ (richest people in the world) ప్రపంచ కుబేరుడిగా అవతరించాడు. ఇప్పటి వరకు నెంబర్న్గా ఉన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రెండో స్థానానికి దిగజారాడు. ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసి రియల్‌టైమ్ బిలియనీర్స్ జాబితాలో ఆర్నాల్డ్ మొదటి స్థానంలో నిలిచారు. ఆయన, వారి కుటుంబ సభ్యుల నికర ఆస్తుల విలువ 207.8 బిలియన్ డార్లకు చేరింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 204.7 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో నిలిచారు.
ప్రపంచ కుబేరుల జాబితాలో భారత పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 11వ స్థానంలో నిలిచారు. ముకేశ్ అంబానీ ఆస్తులు 104.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక గౌతమ్ అదానీ ఆస్తుల విలువ 75.7 బిలియన్ డాలర్లుగా ఉంది. అదానీ 16 స్థానానికి దిగజారారు.