హైదరాబాద్
ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన టెస్టులో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడింది. రెండో ఇన్నింగ్స్
లో ఇంగ్లండ్ 420 పరుగులు చేసి భారత్ ముందు 231 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో
భారత టాప్ ఆర్డర్ విఫలం కావడంతో 202 పరుగలకే ఆలౌట్ కావడంతో 28 పరుగుల తేడాతో ఓడింది.
ఇంగ్లండ్
స్పిన్నర్ టామ్ హార్ట్లీ రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు తీసి భారత్ విజయావకాశాలను
దెబ్బతిశాడు.
టామ్
హార్ట్లీ వేసిన 12 వ ఓవర్ లో జైస్వాల్, శుభమన్ గిల్ పెవిలియన్ చేరారు. 63 పరుగులకే
భారత్ మూడు వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది.
కేఎల్ రాహుల్ అక్షర పటేల్ నాలుగో వికెట్ కు 32 పరుగులు జోడించారు. టీ
విరామం తర్వాత అక్షర పటేల్ ను హార్ట్లీ ఔట్ చేశాడు. ఆ తర్వాత రాహుల్, శ్రేయస్
అయ్యర్ కూడా వెనుదిరిగారు. రవీంద్ర జడేజా
రన్ ఔట్ గా పెవిలియన్ చేరడం, అయ్యర్ ను జాకీ లీచ్ ఔట్ చేయడంతో భారత్ గెలుపు మరింత
ప్రశ్నార్థకంగా మారింది.
రవిచంద్రన్
అశ్విన్, శ్రీకర్ భరత్ కలిసి 21 ఓవర్లు ఆడి 8వ వికెట్ కు 57 పరుగులు జోడించారు.
నాలుగో
రోజు ఆట మరో రెండు ఓవర్లలో ముగుస్తుందనగా భరత్ ను హార్ట్లీ పెవిలియన్ చేర్చాడు.
సిరాజ్, బుమ్రా పదో వికెట్ కు 25 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పినా ఫలితం
దక్కలేదు. సిరాజ్ స్టంప్ ఔట్ గా వెనుదిరగడంతో ఇంగ్లండ్ విజయం సాధించింది.