బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ 9వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నితీశ్ కుమార్తో గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆర్జేడీ మద్దతు వదిలేసుకున్న నితీశ్, తాజాగా బీజేపీతో జట్టుకట్టారు.
నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఇతర ప్రముఖలు హాజరయ్యారు. నితీశ్ ఇండీ కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీయేతో చేతులు కలిపారు. దీంతో ఇండీ కూటమి మూన్నాళ్ల ముచ్చటైంది. డిప్యూటీ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణం చేశారు.