టెస్ట్
చాంపియన్‌షిప్ విజేత, వన్డే వరల్డ్‌కప్ విజేత ఆస్ట్రేలియాను సొంతగడ్డపై కరేబియన్
జట్టు ఓడించి చరిత్ర సృష్టించింది. బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో జరిగిన పింక్
బాల్ టెస్టులో వెస్టిండీస్ జట్టు 8 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.
టెస్టుల్లో ఆస్ట్రేలియాపై 21 ఏళ్ళ తర్వాత గెలవడంతో సిరీస్ 1-1తో సమం అయింది.
మొదటి టెస్టులో విండీస్‌ను ఆస్ట్రేలియా పది
వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
విండీస్
ఆటగాడు షమార్ జోసెఫ్
68 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు.
బోటన వేలుకు దెబ్బ తగిలినా ఓర్చుకుని జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది
సిరీస్ అవార్డులను కైవసం చేసుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు 311
పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఆసీస్ 289/9
స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేయగా ఆ నిర్ణయం బెడిసికొట్టి ఓటమికి దారి
తీసింది. ఆసీస్ ను గెలిపించేందుకు స్టీవ్ స్మిత్(91*) చెమటోడ్చినా
మిగతా వారి నుంచి సహకారం లభించకపోవడంతో
ఓటమి తప్పలేదు.
తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 311 పరుగులకు
ఆలౌటైంది.
కవెమ్ హాడ్జ్(71), జాషువ డసిల్వ(79), కెవిన్ సింక్లెయిర్(50) మెరుగుగా
ఆడారు.
స్టార్క్ నాలుగు వికెట్లు తీయగా, హాజిల్ వుడ్, కమిన్స చెరో రెండు వికెట్లు
పడగొట్టారు. నాథన్ లయన్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
లక్ష్యఛేధనలో ఆసీస్ 9 వికెట్లు నష్టపోయి 289 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్
చేసింది. ఉస్మాన్ ఖ్వాజా, అలెక్స్,
కమిన్స్ అర్థ శతకాలు చేశారు.
సెకండ్ ఇన్నింగ్స్ లో విండీస్ 193 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. 216
పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నించిన ఆసీస్ ను షమార్ ముప్పతిప్పలు
పెట్టాడు. 193 పరుగులకే ఆ జట్టు రన్ ఆర్డర్ కుప్పకూలి ఓటమి చెందింది.