బిహార్ సీఎం నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా
చేశారు. గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ను కలిసి రాజీనామా లేఖ అందజేశారు. నితీశ్ రాజీనామాను
ఆమోదించిన గవర్నర్, కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఆపధర్మ సీఎంగా కొనసాగాలని
కోరారు. దీంతో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న
మహాగట్బంధన్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది.
బిహార్ లో ఈ రోజు సాయంత్ర సాయంత్రం బీజేపీ-జేడీయూ
ప్రభుత్వం కొలువదీరనుంది. మాజీ ముఖ్యమంత్రి జితిన్ రాం నేతృత్వంలోని హిందూస్తానీ
అవామీ లీగ్ కొత్త కూటమిలో చేరేందుకు సముఖత తెలిపింది.
శాసనసభా పక్షనేతగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్
చౌదరి ఎన్నికయ్యారు. తన జీవిత కాలంలో సాధించిన అరుదైన ఘనత అంటూ ఆయన ఆనందం వ్యక్తం
చేశారు.
మహా కూటమిలో పరిస్థితులు సరిగా లేవన్న నితీశ్,
అందుకే కొత్త కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఏడాదిన్నరగా మహా
కూటమి ప్రభుత్వం సరిగ్గా ముందుకు వెళ్ళలేకపోయిందన్నారు. అందరి అభిప్రాయాలు
తీసుకున్న తర్వాతే రాజీనామాకు సిద్ధమైనట్లు వెల్లడించారు.
కొత్త ప్రభుత్వంలో నితీశ్ సీఎంగా, బీజేపీ నేతలు
సుశీల్ కుమార్ మోదీ, రేణూదేవి ఉప ముఖ్యమంత్రులుగా
ప్రమాణం చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.