హైదరాబాద్
వేదికగా భారత్ –ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్, నాలుగో రోజు ఆటలో
ఇంగ్లండ్ ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో 420 పరుగులు చేసిన ఇంగ్లండ్ జట్టు, భారత్
కు 231 పరుగుల లక్ష్యాన్ని విధించింది.
ఓవర్
నైట్ స్కోర్ 316/6 తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ
తగిలింది. బుమ్రా బౌలింగ్‌లో రెహాన్ అహ్మద్(28) ఔట్ అయ్యాడు. 352 పరుగులు వద్ద ఏడో వికెట్ నష్టపోయిన ఇంగ్లండ్, 419
పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్ లో 420 పరుగుల వద్ద తొమ్మిదో
వికెట్ గా మార్క్ వుడ్ డకౌట్ అయ్యాడు.
ఓవర్
నైట్ స్కోర్ 148 తో క్రీజులోకి వచ్చిన ఒలీ పోప్, తృటిలో డబుల్ సెంచరీ
చేజార్చుకున్నాడు. టామ్ హార్ట్లే తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 80 పరుగుల
భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కానీ 196 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్ లో ఔట్ అయి డుబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు.
బుమ్రా
నాలుగు వికెట్లు తీయగా, అశ్విన్ మూడు, జడేజా రెండు వికెట్లు, అక్షర పటేల్ ఒక వికెట్
ను తమ
ఖాతాలో వేసుకున్నారు.