ప్రపంచంలోని అతిపెద్ద ఐదు ఆర్థిక వ్యవస్థల్లో భారత ఆర్థిక వ్యవస్థ చేరిన సంగతి తెలిసిందే. అయితే భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశ ముందని పలువురు ఆర్థిక నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. మౌలికరంగంలో భారీ పెట్టుబడులు, సంస్కరణలు ముందుకు తీసుకెళ్లడం, సాంకేతికత వినియోగంపై కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ఇందుకు ఉపయోగపడుతున్నాయని ప్రముఖ కార్పొరేట్లు ధీమా వ్యక్తం చేశాయి.
2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.5 శాతం కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా. ఆటో రంగంలో 50 శాతం, రిటైల్ 66, టెక్నాలజీ, మీడియా, టెలికాం రంగాలు 47 శాతం వృద్ధి నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నారు.
కేంద్రం తీసుకుంటోన్న నిర్ణయాలతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో డిమాండ్ నమోదవుతోందని డెలాయిట్ అంచనా వేసింది.
రాబోయే రోజుల్లో భారత్లో సెమీ కండక్టర్ పరిశ్రమ శరవేగంగా వృద్ధి నమోదు చేసే అవకాశముంది. పరిశోధన, అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కార్పొరేట్లు కోరుతున్నారు. కొందరు మేథోసంపత్తి హక్కులకు విధానాలు రూపొందించాలని అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా 99 శాతం వ్యాపారాల వృద్ధికి దోహదపడుతుందని అంచనా.