Tirumala news: TTD
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల ఆలయంలో
ఫిబ్రవరి లో పలు విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి
9న శ్రీ పురందరదాసుల ఆరాధనోత్సవాన్ని శాస్త్రోక్తంగా టీటీడీ
నిర్వహించనుంది.
పదో తేదీన తిరుకచ్చినంబి ఉత్సవారంభం కానుంది. శ్రీవారి ఆలయంలో వసంత పంచమి పండుగను ఫిబ్రవరి 14న
నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 16న
రథసప్తమి, 19న తిరుకచ్చినంబి శాత్తుమొర,
ఫిబ్రవరి 20న
భీష్మ ఏకాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 21న
శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం, 24న
కుమారధార తీర్థముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడసేవ కార్యక్రమాలు నిర్వహిస్తోన్నట్లు టీటీడీ
తెలిపింది.
రథ
సప్తమి రోజున తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారు ఏడు వాహనాలపై ఊరేగి భక్తులను
అనుగ్రహించనున్నారు. అమ్మవారి ఆలయం పక్కన ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో
ఉదయం 6 గంటలకు స్వామి వారు అశ్వవాహనాన్ని
అధిష్టించి భక్తులను కటాక్షిస్తారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా ఫిబ్రవరి 13న ఆలయంలో
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం
పడుతోంది. శనివారంనాడు స్వామి వారిని 71, 664 మంది దర్శించుకోగా, 33, 330 మంది
భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల రూపంలో స్వామివారికి రూ. 3.37కోట్ల
ఆదాయం లభించింది.