రేషన్ కార్డు ఉపయోగించుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ అందించింది. రేషన్ కార్డుల ఈ-కేవైసీ (rationcard E kyc) చేసుకునే గడవును కేంద్రం పొడిగించింది. గతంలో విధించిన గడవు ఈ నెల 31తో ముగియనుంది. అనేక రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. వినియోగదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కేంద్రం గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగించింది.
చాలా రాష్ట్రాల్లో ఈ-కేవైసీ 70 శాతం కూడా దాటలేదు. తెలంగాణలో 75.76 శాతం పూర్తైంది. ఏపీలో 79 శాతం పూర్తి చేశారు. ఫిబ్రవరి 28వ తేదీ నాటికి మొత్తం నూరు శాతం ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఈ-కేవైసీ చేయని కార్డుదారులకు రేషన్ నిలిపివేయనున్నారు. గడవు ఇప్పటికే చాలాసార్లు పొడిగించారు. తాజాగా ఫిబ్రవరి నెలాఖరుకు పెంచారు.