పర్యాటకులకు కనువిందు చేసే ప్రపంచంలోనే అతి పెద్ద క్రూజ్ నౌక జల ప్రవేశం చేసింది. దాదాపు రూ.4500 కోట్ల వ్యయంతో రాయల్ కరీబియన్ సంస్థ ఐకాన్ ఆఫ్ ది సీస్ అనే నౌకను (worlds largest cruise ship) తయారు చేయించింది. అమెరికాలోని మయామీ పోర్టు నుంచి శనివారం ఈ నౌక జల ప్రవేశం చేసింది. ప్రపంచంలో అనేక దేశాలను చుట్టిరావాలనుకునే పర్యాటకులకు ఈ నౌక సర్వధామంలా నిలవనుంది.
దాదాపు 305 మీటర్ల పొడవు, 20 డెక్కులున్న ఈ నౌకలో ఒకేసారి 7600 మంది ప్రయాణించవచ్చు. నౌకలో ఆరు వాటర్ స్లైడ్లు, ఏడు ఈత కొలనులు ఉన్నాయి. ఇక ఐస్ స్కేటింగ్ రింగ్ ఏర్పాటు చేశారు. సినిమా హాలు, 40 రెస్టారెంట్లు, బార్లు ఉన్నాయి. కుటుంబాలతో ప్రయాణించే వారికి ఇది మంచి అనుభూతిని అందిస్తుందని రాయల్ కరీబియన్ సంస్థ ప్రకటించింది. ఓ నౌకలో 2500 మంది సిబ్బంది ఉంటారని సంస్థ సీఈవో జాసన్ లిబర్టీ ప్రకటించారు.