Bharat
vs England : Test 1of 5, end of day 3
England reach 316/6 with a lead of 126 runs
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా
టెస్ట్ మ్యాచ్ లో భారత్ తో తలపడుతున్న ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 126 పరుగుల
ఆధిక్యాన్ని సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 77 ఓవర్లు ఆడి ఆరు వికెట్ల
నష్టపోయి 316 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ ఆటగాడు ఓలీ పోప్ సెంచరీ చేశాడు. 208 బంతుల్లో 17 ఫోర్లతో 148 పరుగులు చేశాడు. పోప్ కు రెహాన్
అహ్మద్ (16*) సహకరిస్తున్నాడు.
బెన్ ఫోక్స్ 34 పరుగులు చేసి అక్షర్ పటేల్
బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే (31), బెన్ డకెట్(47) దూకుడుగా ఆడారు. తొలి వికెట్ కు
9 ఓవర్లలో 45 పరుగులు రాబట్టారు. డకెట్‌ను బుమ్రా పెవిలియన్‌కు పంపగా, క్రాలేను అశ్విన్ ఔట్ చేశారు.
జో రూట్ (2), జానీ బెయిర్ స్టో (10), కెప్టెన్ బెన్ స్టోక్స్ (6) అభిమానులను నిరాశపరిచారు.
భారత
బౌలర్లు బుమ్రా , అశ్విన్
చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకోగా, , అక్షర్ పటేల్ , రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు. తొలి
ఇన్నింగ్స్ లో బ్రిటీషు జట్టు 246 పరుగులు చేయగా, భారత్ 436 పరుగులకు ఆలౌటైంది.