ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ : విజేతగా నిలిచిన బెలారస్ స్టార్
బెలారస్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన అరినా సబలెంక ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించింది. ఫైన్లల్లో అరినా చైనా క్రీడాకారిణి జెంగ్ కిన్వెన్తో పోరాడి గెలిచారు. సబలెంక 6-3, 6-2 తేడాతో వరుస సెట్లలో గెలిచి టైటిల్ గెలుచుకుంది. తొలి సెట్లో జెంగ్ పోరాడినా, తరవాత సబలెంక ముందు నిలవలేకపోయింది. 2013 నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు వరుసగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన మొదటి మహిళగా సబలెంక నిలిచారు.
లీ తరవాత దశాబ్ధకాలంలో మొదటిసారి గ్రాండ్‌స్లామ్ ఆడిన తొలి చైనా ప్లేయర్ జెంగ్ కావడం విశేషం. 21 ఏళ్ల జంగ్ సబలెంక ముందు నిలవలేకపోయింది. సెరెనా తరవాత వరుసగా రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లు (australian open title) నెగ్గి సబలెంక రికార్డు నెలకొల్పారు.