కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ విచిత్రంగా వ్యవహరించారు. కారు దిగి, రోడ్డుపక్కన ఓ దుకాణం ముందు బైఠాయించారు.నిరసన వ్యక్తం చేస్తూ కారు ఆపిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేయాలంటూ గవర్నర్ (kerala governor) నిరసనకు దిగారు. కొల్లాంలో ఈ ఘటన జరిగింది.
కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ ఓ కారక్రమానికి వెళుతుండగా కొందరు విద్యార్థులు నల్లజెండాలు ప్రదర్శించి నిసరన తెలిపారు. ఈ వ్యవహారం గవర్నర్కు ఆగ్రహం తెప్పించింది. వెంటనే కారు దిగి సమీపంలోని షాపు నుంచి కుర్చీ తెచ్చుకుని రోడ్డుపై వేసుకుని కూర్చున్నారు. పోలీసులపై గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులే నిరసనకారులకు రక్షణ కల్పిస్తున్నారని గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కేరళ సీఎం, గవర్నర్ మధ్య ఇటీవల విభేదాలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ వెంటనే ఆమోదించడం లేదు. యానివర్సీటీల్లో నియామకాల విషయంలోనూ ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య విభేదాలున్నాయి.