రాజకీయాలపై
అవగాహన లేకుండా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతున్నారని
బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. బీజేపీ మతతత్వ పార్టీ అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలను
ఖండిస్తున్నట్లు తెలిపారు.
మణిపూర్
అల్లర్లపై షర్మిల అవగాహన రాహిత్యంగా మాట్లాడారని బీజేపీ మైనారిటీ రాష్ట్ర
అధ్యక్షుడు షేక్ బాజీ విమర్శించారు.
విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన
షేక్ బాజీ, రాజకీయ పరిజ్ఞానం లేకుండా పీసీపీ అధ్యక్షురాలిగా ఎలా కొనసాగుతారని
ప్రశ్నించారు. క్రైస్తవులు ఎక్కువుగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన
విషయాన్నితెలుసుకోవాలని హితవు పలికారు. క్రైస్తవులంతా బీజేపీ వెంటే ఉన్నారన్నారు.
మతాలతో
సంబంధం లేకుండా ప్రతిభావంతులను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గుర్తించి
గౌరవిస్తోందన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన పద్మ
అవార్డుల జాబితాలో 75 మంది ముస్లింలు ఉన్నారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు
చెందిన ఖలీల్ అహ్మద్ అనే కళాకారుడికి పురస్కారం దక్కిన విషయాన్ని షర్మిల తెలుసుకుంటే
బాగుంటుందన్నారు.
ఈ
కార్యక్రమంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సయ్యద్
బాషా, మైనారిటీ మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి షేక్ అర్షియా పాల్గొన్నారు.