పాకిస్తాన్
మాజీ క్రికెటర్, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ జీవితం అగమ్యగోచరంగా
మారింది. ఇప్పటికే డజన్లు కొద్దీ కేసుల్లో ఇరుక్కుపోయిన ఇమ్రాన్ ఖాన్, ప్రస్తుతం
జైలు జీవితం గడుపుతున్నారు. ఆయన పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కనబడని దుస్థితి
నెలకొంది.
క్రికెట్‌లో
ఉద్దండుడిగా పేరొన్న రాజకీయాల్లో ప్రవేశించి పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన
తర్వాత ప్రపంచనేతగా గుర్తింపు కోసం ఆరాటపడ్డారు. కానీ ప్రస్తుతం అతడి పరిస్థితి
తారుమారైంది. రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అతడి పూర్వీకుల
ప్రాంతంతో అతడు గతంలో ప్రాతినిధ్యం వహించిన
నియోజకవర్గం మియాన్‌వాలీలో అతడి ఫొటోలు ఉన్న పోస్టుర్లు కనబడటం లేదు, అతడి పార్టీ
జెండాలు ఎగరడం లేదు.
ఇమ్రాన్
ఖాన్ స్థాపించిన పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (PTI)ను ఆ దేశ రాజకీయ ప్రచార ముఖచిత్రం నుంచి తుడిచివేసేందుకు సైన్యం కఠినమైన
అణచివేత చర్యలు చేపట్టింది. పాకిస్తాన్ రాజకీయ అంకంలో పీటీఐ గత చరిత్రకే పరిమితం
కానుంది అన్నట్లుగా పరిణామాలు మారాయి.
తమ
పార్టీ కార్యకర్తలు తీవ్రమైన వేధింపులు ఎదుర్కుంటున్నారని, తనను చంపుతామని
బెదిరించారని మియాన్ వాలీ నుంచి పీటీఐ తరపున పోటీలో ఉన్న జామాల్ ఆషాన్ ఖాన్(61)
ఆవేదన చెందుతున్నారు. ఇమ్రాన్ తరఫున జామాల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తన
జీవిత కాలంలో ఎన్నికల సమయంలో ఇలాంటి బలప్రయోగాన్ని, దుర్భర పరిస్థితులను ఎప్పుడూ చూడలేదంటున్నారు.
అక్రమాస్తుల కేసులో భాగంగా జైలు శిక్ష
అనుభవిస్తోన్న ఇమ్రాన్ ఖాన్, ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా తేలారు. రాజకీయ కక్ష
సాధింపులో భాగంగానే తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఇమ్రాన్ వాదిస్తున్నారు.
ర్యాలీలు చేపట్టేందుకు అడ్డంకులు ఏర్పడటంతో
పాటు మీడియా పై సెన్సార్ ఉండటంతో ఆ పార్టీ పూర్తిగా ఆన్‌లైన్ ప్రచారంపై
ఆధారపడింది.
దేశవ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన అభ్యర్థుల నామినేషన్లు పెద్ద
సంఖ్యంలో తిరస్కరణకు గురయ్యాయి. జామాల్ ఆషాన్ ఖాన్ లాగే పలువురు ఇతర నేతలు కూడా
ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొనలేకపోతున్నారు. కనీసం కరపత్రాలు కూడా పంచలేని
దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎన్నికల తేదీ కి ఇంకా రెండు వారాల గడువే ఉన్నప్పటికీ
ఆ దేశంలో ఎన్నికల సందడి మాత్రం అంతంతమాత్రంగానే ఉంది.
పంజాబ్ ప్రావిన్సులోని గ్రామీణ నియోజకవర్గాల్లో
మియాన్‌వాలీ ఒకటి. ఇమ్రాన్ ఖాన్, ఇక్కడి నుంచి మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
పీటీఐ అధికారంలో ఉన్న సమయంలో మియాన్ వాలీ
ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు చేపట్టింది. ఆస్పత్రి, విశ్వవిద్యాలయం
నిర్మించింది. దీంతో ఆ ప్రాంతంలో ఇమ్రాన్ ను పలువురు హీరోగా ఆరాధిస్తున్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు