1st Test Day 3 Cricket Match
హైదరాబాద్
ఉప్పల్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరుగతున్న టెస్టు లో భారత జట్టు ఆలౌటైంది. ఓవర్
నైట్ స్కోర్ 421/7 తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్, స్కోర్ బోర్డుకు 15
పరుగులు జోడించి 436 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో తొలి సెషన్ లో ఇంగ్లండ్ జట్టుపై
రోహిత్ సేన ఇంగ్లండ్ పై 190 పరుగుల ఆధిక్యాన్నిసాధించింది.
భారత జట్టులో జడేజా (87), కేఎల్ రాహుల్( 86),
యశస్వి జైశ్వాల్( 80) సెంచరీ చేజార్చుకున్నారు. అక్షర పటేల్ 44, శిఖర్ భరత్ 41 పరుగులు వద్ద పెవిలియన్ చేరారు. కెప్టెన్ రోహిత్ శర్మ(24), గిల్ (23), అయ్యర్(35)
కూడా రాణించారు. బ్యాటింగ్ లో అశ్విన్(1), బుమ్రా(0) విఫలమయ్యారు.
ఇంగ్లండ్ బౌలర్లలో రూట్ నాలుగు వికెట్లు తీయగా, హార్ట్లీ, రెహాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లీచ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్
చేసిన ఇంగ్లండ్ జట్టు తొలి సెషన్ లో 246 పరుగులు చేసింది. జడేజా మూడు వికెట్లు
తీయగా, అక్షర పటేల్ రెండు వికెట్టు పడగొట్టి బ్రిటీషు జట్టును కట్టడి చేశారు.