అయోధ్య
బాలరాముడి విగ్రహానికి ఉపయోగించిన కృష్ణశిలను గుర్తించిన వ్యక్తికి కర్ణాటక
ప్రభుత్వం జరిమానా విధించింది. ఓ ప్రైవేటు స్థలంలో అక్రమంగా మైనింగ్ చేశారని
ఆరోపిస్తూ కర్ణాటక రాష్ట్ర మైనింగ్, భూగర్భశాఖ జరిమానా విధించింది. రూ.80 వేలు
చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. జరిమానా చెల్లించేందుకు శ్రీనివాస్ తన భార్య
నగలు తాకట్టు పెట్టాల్సి వచ్చిందని కన్నడ మీడియా పేర్కొంది.
శ్రీనివాస్ నటరాజ్ అనే ఓ చిన్న కాంట్రాక్టర్ కు మైసూర్ సమీపంలోని గుజ్జెగౌదనపుర అనే
గ్రామానికి చెందిన రామదాసు అనే రైతు పొలంలో రాళ్ళను తొలగించేందుకు కాంట్రాక్టు
లభించింది.అక్కడ రాళ్ళు తొలగిస్తుండగా వందల ఏళ్లనాటి కృష్ణశిలను గుర్తించాడు.
దానిని మూడు ముక్కలు చేసి ఓ ముక్కలు చేశారు. అందులో ఒక దానిని బాల రాముడి విగ్రహ
కోసం శిల్పి అరుణ్ యోగీరాజ్ వినియోగించారు.
కృష్ణ
శిల లభించిన పొలం యాజమాని రామదాసు కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన పొలంలో రాముడి
ఆలయం నిర్మిస్తానని ప్రకటించాడు. శిల్పి అరుణ్ తో మాట్లాడి ఆలయం నిర్మాణం విషయంలో
ముందుకెళతానని ప్రకటించాడు.