మహారాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేసేందుకు అంగీకరించడంతో మరాఠా కోటా నిరసనకారుడు మనోజ్ జరంగే పాటిల్ చేపట్టిన నిరాహార దీక్షను విరమించారు. ఓబీసీ కేటగిరీ కింద మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు (maratha reservations agitaion) కల్పించాలంటూ పాటిల్ శుక్రవారం నుంచి నిరాహార దీక్షకు దిగారు. మరాఠాలందరికీ ఈబీసీ సర్టిఫికెట్లు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో పాటిల్ నిరాహార దీక్ష విమరించారు.
ఇప్పటికే 37 లక్షల మంది మరాఠాలకు ఈబీసీ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరాఠాలందరికీ ఇస్తే అది 50 లక్షలకు చేరుతుందని అంచనా. కుంబీలకు కూడా ఈబీసీ కోటా వర్తింపజేస్తున్నారు.
తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ముంబైలోని ఆజాద్ మైదానంలో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని అంతకు ముందు పాటిల్ హెచ్చరించారు. శుక్రవారం రాత్రి ఇద్దరు మంత్రులు పాటిల్‌తో చర్చలు జరిపారు. పాటిల్ డిమాండ్లన్నిటినీ మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేందుకు అంగీకరించడంతో పాటిల్ నిరాహార దీక్ష విమరవించారు.