తిరుమల
తిరుపతి దేవస్థానం(TTD) కీలక ప్రకటన చేసింది. 25 ఏళ్ళ వయస్సు
లోపు వారు గోవిందకోటి రాస్తే బ్రేక్ దర్శనం కల్పిస్తామని తెలిపింది.
యువతలో తిరుమలేశుడిపై భక్తిభావాన్ని, ఆధ్యాత్మికత పెంచేందుకే ఈ నిర్ణయం
తీసుకున్నట్లు వివరించింది.
గోవింద
నామాన్ని పదిలక్షల 116 సార్లు రాస్తే బ్రేక్ దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ
వెల్లడించింది.
ఏప్రిల్
కు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారి వసతి
గదుల కేటాయింపును ఆన్లైన్ లో చేపట్టినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అన్నప్రసాద
విభాగాన్ని పునరుద్ధరించామన్నారు.
చిత్తూరు
జిల్లా చౌడేపల్లి మండలం వెంగలపల్లి గ్రామ పరిధిలోని రాజనాలబండ ప్రసన్న ఆంజనేయస్వామి,
లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోకి తీసుకుంది. ఈ
మేరకు దేవాదాయ శాఖ, టీటీడీ మధ్య ఒప్పందం జరిగింది.
తిరుమలలో
భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు భక్తులతో
నిండిపోయాయి. శుక్రవారం నాడు స్వామివారిని 71,664 మంది దర్శించుకోగా 33, 330 మంది
తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో రూ. 3.37 కోట్ల ఆదాయం అందింది.