ఎర్రసముద్రంలో హౌతీలు మరోసారి రెచ్చిపోయారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతంలో చమురు ట్యాంకర్లతో వెళుతోన్న రవాణా నౌకలపై హౌతీలు (houthi rebels attak) దాడులకు దిగారు. హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో బ్రిటన్కు చెందిన మార్లిన్ లాండ నౌకలో మంటలు చెలరేగాయి. నౌకా సిబ్బంది వెంటనే మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. సిబ్బంది సురక్షితంగా బయటపడ్డట్లు నౌక ఆపరేటర్ సంస్థ ట్రాఫిగురా ప్రకటించింది.
ఎడెన్కు 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగింది. హౌతీల దాడి విషయం తెలియగానే యుద్ధ నౌకలు రంగంలోకి దిగాయి. హౌతీలు మరిన్ని దాడులకు తెగబడే ప్రమాద ముందని బ్రిటన్ హెచ్చరించింది. ఎర్ర సముద్రంలో వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన క్షిపణిని బ్రిటన్ యుద్ధనౌక కూల్చివేసింది. ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ ఈ దాడులకు దిగుతున్నట్లు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. హౌతీల దాడులపై అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. అయినా హౌతీలు వెనకడుతు వేయడం లేదు.