Aarti and Darsan Timings for Balak Ram at Ayodhya announced
జన్మస్థానంలో శతాబ్దాల తర్వాత అవతరించిన అయోధ్య
బాలరాముడి దర్శనానికి లక్షలాదిగా జనం పోటెత్తుతున్నారు. ఆ నేపథ్యంలో ‘బాలక్ రామ్’
హారతి, దర్శనం వేళలను ఖరారు చేసారు.
శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తాజాగా
విడుదల చేసిన సమాచారం ప్రకారం ప్రతీరోజూ తెల్లవారుజామున 4.30కు శృంగార హారతితో
కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 6.30కు మంగళహారతి ఇస్తారు. భక్తులకు దర్శనాలు 7
గంటల నుంచీ మొదలవుతాయి.
ఇక భోగహారతి మధ్యాహ్నం ఇస్తారు. రాత్రి 7.30 గంటల
సమయంలో సంధ్యాహారతి ఉంటుంది. మళ్ళీ రాత్రి 8 గంటలకు మరోసారి భోగహారతి ఉంటుంది. రాత్రి 10గంటలకు శయనహారతితో మందిరంలో రోజువారీ పూజాదికాలు
ముగుస్తాయి.
జనవరి 22న బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం
జరిగింది. జనవరి 23 నుంచీ భక్తులకు దర్శనాలు మొదలయ్యాయి. నాటినుంచీ లక్షల సంఖ్యలో
భక్తులు రామయ్యను దర్శించుకుంటున్నారు.
అంతేకాదు, చేరువలోనే ఉన్న హనుమాన్ గఢీ ఆలయంలో సైతం
భక్తజనసందోహం ఎక్కువగా ఉంటోంది. ఆంజనేయ స్వామికి వేలాది భక్తులు లడ్డూలు ప్రసాదంగా
నివేదన చేసి, వాటిని దర్శనానికి వచ్చినవారికి పంచిపెడుతున్నారు.
మొత్తం మీద అయోధ్య రోజురోజుకూ
మహాజనసంద్రంగా పొంగిపొర్లుతోంది.