సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం చకచకా పనులు చక్కబెడుతోంది. దేశంలో 96 కోట్ల మందికి ఓటు హక్కు కల్పించినట్లు సీఈసీ (central election commission) ప్రకటించింది. వీరిలో 47 కోట్లు మహిళలు కాగా, 49 కోట్ల మంది పురుషులున్నారు.కొత్తగా అర్హత పొందిన వారు 1.73 కోట్ల మంది ఉన్నారు. వీరంతా 18 నుంచి 19 ఏళ్లలోపు వారే.
దేశ వ్యాప్తంగా 12 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సీఈసీ సిద్దం అవుతోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కోటిన్నర మంది సిబ్బంది విధుల్లో పాల్గొనే అవకాశం ఉంది. వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఓ లేఖ పంపింది. దాని ప్రకారం 1951లో 17.32 కోట్ల మంది ఓటర్లు ఉండగా 2019 నాటికి 91.2 కోట్లకు చేరింది. తాజాగా అది 96 కోట్లకు చేరింది. తొలి సార్వత్రిక ఎన్నికల్లో 45 శాతం పోలింగ్ నమోదు కాగా 2019లో అది 67 శాతంగా ఉంది.