Ind Vs Eng: Test 1 Day 2: India ends day 2 with 175 runs lead
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న
మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య భారతదేశం ఇంగ్లండ్‌పై ఆధిక్యం సాధించింది. ఇవాళ రెండోరోజు
ఆట ముగిసే సమయానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసి ఇంగ్లండ్‌పై
175పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
మొదటిరోజు ఇంగ్లండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో
246 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఒక వికెట్
నష్టపోయి 119 పరుగులు చేసింది. అక్కడితో మొదటిరోజు ఆట ముగిసింది.
ఇవాళ 119 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మ్యాచ్
మొదలుపెట్టిన భారత జట్టు మొదటి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. పార్ట్ టైమ్
స్పిన్నర్ జో రూట్ బౌలింగ్‌లో ఒక ఫోర్ కొట్టిన యశస్వి జైస్వాల్, మరో బాల్‌కు భారీ
షాట్ ప్రయత్నించి బౌలర్‌కే క్యాచ్ ఇచ్చాడు. మరికాసేపటికే శుభ్‌మన్ గిల్ కూడా ఔట్
అయ్యాడు. తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ జోడీ 64 పరుగులు చేసింది. వారిద్దరూ
ఔటయ్యాక రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆరో వికెట్‌కు 68
పరుగులు జోడించారు. శ్రీకర్ భరత్ 41 పరుగులు చేసి జో రూట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రవిచంద్రన్
అశ్విన్ కేవలం 1 పరుగుకే రనౌట్ అయ్యాడు. రెండోరోజు ఆట ముగిసేసరికి రవీంద్ర జడేజా, అక్షర్
పటేల్ క్రీజ్‌లో ఉన్నారు.
భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోర్: యశస్వి జైస్వాల్ 80,
రోహిత్ శర్మ 24, శుభ్‌మన్ గిల్ 23, కెఎల్ రాహుల్ 86, శ్రేయస్ అయ్యర్ 35, కెఎస్ భరత్
41, రవిచంద్రన్ అశ్విన్ 1…. రవీంద్ర జడేజా 81, అక్షర్ పటేల్ 35 పరుగులతో నాటౌట్‌గా
ఉన్నారు. మొత్తం స్కోర్ 7 వికెట్ల నష్టానికి 421 పరుగులు. జస్ప్రీత్ బుమ్రా,
మహమ్మద్ సిరాజ్ ఆడవలసి ఉంది.