రిపబ్లిక్ డే వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఢిల్లీలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్‌లో రాష్ట్రతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ హాజరయ్యారు. ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో (republicday celebrations) ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ప్రధాని మోదీ ముందుగా నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించారు. ముఖ్య అతిథి ప్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంప్రదాయ బగ్గీ వద్దకు ఆహ్వానించారు. నాలుగు దశాబ్దాల తరవాత మొదటి సారి బగ్గీని ఉపయోగించారు. కర్తవ్యపద్ చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జండా ఆవిష్కరించారు. ఆ తరవాత శకటాల ప్రదర్శన మొదలైంది. బాలరాముడు, చంద్రయాన్ శకటాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
శకటాలు, సైనికుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మొదటిసారిగా జాతీయ మహిళా శక్తికి అద్దంపట్టేలా అవాహన్తో పరేడ్‌ను ప్రారంబించారు. వంద మంది మహిళలు సంప్రదాయ సంగీతం ఆలపించారు. బ్యాండుకు బదులు శంఖం, నాదస్వరం, నగరా సంగీతంతో ఆకట్టుకున్నారు.
ఏపీలోనూ రిపబ్లిక్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. వివిధ శాఖల శకటాలు ఆకట్టుకున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.