5 Padma Vibhushan
17 Padma Bhushan and
110 Padma Shri Awards
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్
చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం అందుకోనున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని
పురస్కరించుకుని ఈ ఏడాదికి గాను ఈ అవార్డులను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. మొత్తం
ఐదుగురు వ్యక్తులను పద్మవిభూషణ్ వరించగా అందులో ఇద్దరు తెలుగు వారు ఉన్నారు.
త్వరలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజా సంబంధాల విభాగంలో
మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కళల విభాగంలో మెగాస్టార్ చిరంజీవి ఈ పురస్కారానికి
ఎంపికయ్యారు. తమిళనాడుకు చెందిన ఇద్దరికి ఈ పురస్కారం
దక్కింది. కళల విభాగంలో వైజాయంతి బాలి, పద్మ సుబ్రహ్మణంను పద్మ విభూషణ్ అవార్డు
వరించింది. ఇక సామాజిక సేవ విభాగంలో బిహార్ ను చెందిన బిందేశ్వర్ పాతక్ కు ఆయన మరణానంతరం ఈ
పురస్కారాన్ని ప్రకటించి గౌరవించింది.
పద్మశ్రీ అవార్డుల జాబితాలో తెలంగాణకు
చెందిన ఐదుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ హరికథా
కళాకారిణి డి.ఉమామహేశ్వరిని కేంద్రప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
తెలంగాణకు చెందిన గడ్డం సమ్మయ్య(చిందు
యక్షగానం కళాకారుడు), దాసరి కొండప్ప(బుర్రవీణ కళాకారుడు ) పురస్కారాన్ని అందుకోనున్నారు.
తన నివాసాన్ని గ్రంథాలయంగా మార్చి 2 లక్షల
పుస్తకాలు సమకూర్చిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, బంజారా జాతి జాగృతం కోసం పని చేస్తున్న
కేతావత్ సోమ్లాల్, యాదాద్రి ఆలయ శిల్పి, స్థపతి వేలు ఆనందాచారి పద్మశ్రీ అవార్డు
అందుకోనున్నారు.
ఈ ఏడాదికి గాను మొత్తం 132 మందికి కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ అవార్డులు. వివిధ రంగాల్లో విశిష్ట
సేవలు అందించిన వారిని ఈ పౌర పురస్కారాలకు కేంద్రప్రభుత్వం ఎంపికచేసి గౌరవిస్తోంది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్