One who burnt Ramcharit Manas book and Hanuman pic is arrested
రామాయణ గ్రంథాన్ని, హనుమంతుడి బొమ్మను తగులబెట్టిన
ఒక వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసారు.
రిషిదత్ మిశ్రా అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని
షాజహాన్‌పూర్ జిల్లా సరాయ్కయాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతను రామాయణం
గ్రంథాన్ని, హనుమంతుడి చిత్రపటాన్నీ తగలబెట్టాడు. ఆ ఘటనను వీడియో తీసి సోషల్‌మీడియాలో
పెట్టాడు. స్థానిక పోలీసులు ఆ వీడియో చూసినప్పుడు అతన్ని గుర్తించి అరెస్ట్
చేసారని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ మీనా చెప్పారు.
ఇంతకీ మిశ్రా ఆ పని ఎందుకు చేసాడన్న సంగతి
తెలియరాలేదు. ఆ సంఘటన, అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన మర్నాడు అంటే
మంగళవారం జనవరి 23 రాత్రి చోటు చేసుకుంది. బుధవారం నాడు ఆ వీడియోను సోషల్ మీడియాలో
అప్లోడ్ చేసాడు. నిందితుడిపై రామచంద్ర మిషన్ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్
రిజిస్టర్ అయిందని ఎస్పీ మీనా వెల్లడించారు.
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం
నేపథ్యంలో ఇటీవల ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.
జనవరి 22న షకీబ్ అనే వ్యక్తి రాముడి చిత్రపటాన్ని
కాల్చినందుకు అరెస్ట్ అయ్యాడు. అతను తన ఇంట్లో ఎలక్ట్రిక్ హీటర్‌తో రాముడి బొమ్మను
తగలబెట్టాడు. ఆ ఘటనను చిత్రీకరించి వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వీడియో
వైరల్ అయి పెద్ద గొడవే జరిగింది. కొన్నిగంటల్లోనే పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి
తీసుకున్నారు.
జనవరి 19న గోపాల్ అర్గల్ అలియాస్ గోపాల్ రావణ్
అనే వ్యక్తి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో అరెస్ట్ అయ్యాడు. అయోధ్య రామమందిరం
బొమ్మ ఉన్న ఒక వాల్‌పోస్టర్‌ని చించివేసాడు. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో
ప్రచారం చేసాడు. దాన్ని చూసిన హిందూసేన కార్యకర్త ఒకరు చేసిన ఫిర్యాదుతో పోలీసులు అతన్ని
అరెస్ట్ చేసారు.
కర్ణాటకలో జనవరి 17న
ఇద్దరు వ్యక్తులు శ్రీరాముడి చిత్రాలను చింపివేసిన నేరానికి ఇద్దరు వ్యక్తులను
అరెస్ట్ చేసారు. వారు కోలార్ జిల్లాలోని జహంగీర్ మొహల్లా, గునుగుంటె పాల్య
గ్రామాలకు చెందినవారు. ఆ ఇద్దరిలో ఒకరిని జహీర్ఖాన్గా గుర్తించారు. అతను జనవరి
16 రాత్రి అరెస్ట్ చేసారు. జహీర్ ఖాన్ ఆనాటి రాత్రి బ్యానర్‌ను కత్తిరించివేస్తూ
సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాడు
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు