టాస్
గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులు చేసి ఆలౌటైంది.
తొలి వికెట్ గా బెన్ డకెట్(35) అశ్విన్ బౌలింగ్ లో ఎల్బీ గా వెనుదిరిగాడు. అనంతరం 58
పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఓలి పోప్ కేవలం ఒకే ఒక్క పరుగు చేసి జడేజా బౌలింగ్
లో క్యాచ్ ఔటయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్
బౌలింగ్ లో జాక్ క్రాలీ(20) ఔట్ కావడంతో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. లంచ్
విరామ సమయానికి మూడు వికెట్లు నష్టపోయి 108 పరుగులు చేసింది.
ఆ తర్వాత 121 పరుగుల వద్ద నాలుగో వికెట్ ను
నష్టపోయింది. బెయిర్ స్టో (37)ను అక్షర పటేల్ బౌల్డ్ చేశాడు. జడేజా వేసిన 37వ ఓవర్లో జో రూట్ క్యాచ్ ఔట్ రూపంలో
పెవిలియన్ చేరాడు. బెన్ ఫోక్స్ కూడా నిరాశ పరిచాడు. కేవలం నాలుగు పరుగులు చేసి
అక్షర పటేల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. రెహాన్ అహ్మద్ కూడా 16 పరుగుల వద్ద
నిష్క్రమించాడు. 56 ఓవర్లు ముగిసే సరికి
ఏడు వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేసింది.
జడేజా
వేసిన 60.2 బంతిని సిక్స్ బాదిన బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీ మార్క్ దాటాడు. మార్క్ వుడ్ ను అశ్విన్ బౌల్డ్ చేశాడు.
ఇక 246
పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (70) టాప్ స్కోరర్ గా నిలిచాడు.
భారత
బౌలర్లలో జడేజా, అశ్విన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, అక్షర పటేల్, బుమ్రా చెరో
రెండు వికెట్లు తీశారు.
తొలి
ఇన్నింగ్స్ ను భారత జట్టు ఘనంగా ప్రారంభించింది. ఓపెనర్లు . యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ 11 ఓవర్లు ముగిసే సరికి 73 పరుగుల భాగస్వామ్యాన్ని
నెలకొల్పారు. యశస్వీ 47 బంతుల్లో 51 పరుగులు చేశాడు. 11.1 బంతిని
ఫోర్ బాది అర్థ శతకం చేశాడు. రోహిత్ శర్మ 27
బంతుల్లో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.