స్టాక్ మార్కెట్ల లాభాల పరుగునకు బ్రేక్ పడింది. ఇవాళ దేశీయ స్టాక్ సూచీలు భారీగా నష్టపోయాయి. పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడం, అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా లేకపోవడంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ రోజంగా ఊగిసలాట మధ్యకొనసాగింది. స్వల్ప నష్టాలతో మొదలైన సెన్సెక్స్ (sensex news) చివరకు 359 పాయింట్ల నష్టంతో 70700 వద్ద ముగిసింది. నిఫ్టీ 101 పాయింట్లు కోల్పోయి, 21352 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువు రూ.83.12గా కొనసాగుతోంది.
భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, విప్రో, హెచ్‌సీఎల్ కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఐటీ రంగం భారీ నష్టాలను చవిచూసింది. టెక్ మహీంద్రా షేర్లు ఒక దశలో భారీగా 6 శాతంపైగా నష్టపోయాయి. తరవాత స్వల్పంగా కోలుకుంది. ముడిచమురు ధర స్పల్పంగా పెరిగి 81.13 వద్ద ముగిసింది. ఔన్స్ బంగారం 2018 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.