గణతంత్ర
దినోత్సవం సందర్భంగా ఈ ఏడాదికి 1,132 మంది ఉద్యోగులకు కేంద్ర హోంశాఖ గ్యాలంట్రీ
అవార్డులు ప్రకటించింది. పోలీసు, ఫైర్, హోంగార్డు, ఫైర్, సివిల్ డిఫెన్స్ శాఖలకు
చెందిన ఉద్యోగుల వారి రంగాల్లో అందించిన సేవలకు గాను ఈ
పతకాలు అందజేయనుంది.
గ్యాలంట్రీ పతకాలు దక్కించుకున్నవారిలో అత్యధికంగా
జమ్ము-కశ్మీర్ లో 72 మంది పోలీసలు ఉన్నారు. చత్తీస్గఢ్ నుంచి 26 మంది, జార్ఖండ్
నుంచి 23, మహారాష్ట్ర నుంచి 18 మంది ఉన్నారు.
వామపక్ష
తీవ్రవాద ప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తోన్న 119 మంది, దేశ సరిహద్దు
రాష్ట్రమైన జమ్ము-కశ్మీర్ లో విధులు నిర్వహిస్తోన్న 133 మందికి ఈ గౌరవం దక్కింది.
275
మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్, 102 మందికి విశిష్ఠ సేవా పతకం, 753 మందికి పోలీస్ విశిష్ట సేవా
పతకాలను రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం అందజేయనుంది.
తెలుగు
రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి 20 మంది అధికారులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మందికి
పురస్కారం దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మందికి పోలీసు విశిష్ఠ సేవా పతకాలు
ఇవ్వనున్నారు. ఇద్దరు అధికారులను రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలతో గౌరవించినుంది. పోలీసు
విశిష్ఠ సేవా పతకాలను 12 మంది అధికారులు అందుకోనున్నారు.