అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాకు ఆర్థిక సాయం చేశాడనే అనుమానంతో మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన ఇంజనీర్‌ను అరెస్ట్ చేశారు. ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) గురువారంనాడు ఓ ఇంజనీర్‌ను అదుపులోకి తీసుకుంది.అంతర్జాతీయంగా వ్యాపారం నిర్వహించే ఈ యువ ఇంజనీర్ సిరియా కేంద్రంగా పనిచేస్తోన్న ఐసిస్ ఉగ్రసంస్థకు (isis terrorist) మూడుసార్లు నగదు పంపినట్లు గుర్తించారు.
యువ ఇంజనీర్‌తో సంబంధాలున్న వారి గురించి కూడా ఉగ్రవాద నిరోధక దళం దర్యాప్తు చేస్తోంది. భారత్ నిషేధించిన ఐసిస్ ఉగ్రవాదులతో యువ ఇంజనీర్ నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు ఏటీఎస్ గుర్తించింది. యువ ఇంజనీర్ ఇంట్లో కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ల్యాప్‌ట్యాప్‌లు, కొన్ని పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. యువ ఇంజనీర్‌పై ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచారు. జనవరి 31 వరకు కస్టడీకీ అనుమతిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు