ఐదు
మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఉప్పల్‌లో తొలి టెస్టు ప్రారంభమైంది. ఇంగ్లండ్
జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఓవర్‌ను జస్ప్రీత్ బుమ్రా వేయగా
ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ ఆటను ప్రారంభించారు. ఇరువురు కలిసి ఐదు
ఓవర్లకు 31 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఐదు
మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను తొలిసారి ఆడటంపై జట్టు సభ్యులంతా ఉత్సాహంగా ఉన్నారని
కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లకు
అవకాశమిచ్చామన్నారు.
తమ
జట్టులో ప్రతీఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారని, భారీ స్కోరు సాధించేందుకు
ప్రయత్నిస్తామని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ధీమా ప్రదర్శించాడు.
భారత
జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి
జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్
భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా,
మహమ్మద్ సిరాజ్.
స్వదేశంలో
వరుసగా 16 టెస్టు సిరీస్‌లు గెలిచిన భారత్ మంచి ఫామ్ లో ఉంది. ఇక 2012లో మాత్రం
ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి చెందింది.
భారత్
జట్టు డబ్ల్యూసీ పట్టికలో రెండో స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ ఏడో స్థానంలో ఉంది. రెండు
జట్లు సమఉజ్జీవులుగా ఉన్నప్పటికీ సొంతగడ్డపై ఆడటం భారత్ కు కలిసి వచ్చే అంశం.