Bharat vs
England, 1st Test : భారత్ –ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ రేపటి(జనవరి 25)
నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ కోసం
బ్రిటీష్ జట్టు తుది జట్టును ప్రకటించింది.
పేసర్ ఆండర్సన్ ఆటకు దూరం కావడంతో అతడి స్థానంలో
మార్క్‌వుడ్ కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అవకాశం
కల్పించింది. స్పిన్నర్ల కోటాలో రెహన్ అహ్మద్, జాక్ లీచ్, టామ్ హార్ట్ లీ
ఆడనున్నారు.
ఇంగ్లండ్ జట్టు : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్,
జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, మార్క్ వుడ్, జాక్
లీచ్, టామ్ హార్ట్లీ బెన్ ఫోక్స్(కీపర్)
ఉప్పల్ మైదానంలో ప్రత్యేక వ్యూహంతో ఆడి విజయం
సాధిస్తామని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యర్థులు
ఎలా ఆడుతున్నారనే దాని తనకు ఆసక్తి లేదన్న రోహిత్, మన ఆటను మనం ఆడాల్సి ఉందన్నారు.
తొలి రెండు టెస్టుల్లో విరాట్ లేకపోవడం జట్టుకు లోటుగానే భావించాల్సి ఉంటుందన్నారు.