భారత
క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, అంతర్జాతీయ క్రికెట్లో మరోసారి చరిత్ర సృష్టించాడు.
2023 ఏడాదికి గాను ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికయ్యాడు. ఈ అత్యున్నత
పురస్కారాన్ని అందుకోవడం వరుసగా ఇది రెండోసారి కావడం విశేషం.
గత
ఏడాది 17 ఇన్నింగ్స్ ల్లో 48.86 సగటుతో 733 పరుగులు చేయడంతో పాటు స్ట్రైక్ రేట్
155.95 గా ఉంది. రెండు సెంచరీలు కూడా సూర్య ఖాతాలో ఉన్నాయి.
సికందర్
రజా(జింబాబ్వే), చాప్మన్, ఆల్పేశ్ రమ్జాని(ఉగాండా) ఈ అవార్డు కోసం పోటీపడ్డారు.
ఈ అవార్డును
ఐసీసీ 2021 నుంచి బహుకరిస్తోంది. తొలి ఏడాదిలో మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్) ను ఈ
పురస్కారం వరించింది.
ప్రపంచకప్
టోర్నీలో రాణించిన న్యూజీలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర, 2023 ఏడాదికి గాను
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
సొంతం చేసుకున్నాడు.