Muslims attack on Shobha Yatras of Hindus, across the country, on Consecration Day
ఐదువందల ఏళ్ళ క్రితం భారతదేశాన్ని జయించిన ముస్లిం
రాజులు రాక్షస బుద్ధితో అమానుష బలంతో రామమందిరాన్ని కూల్చేసారు. దేశ పరిపాలన
పరాయివారి చేతుల్లోకి పోవడం కంటె, తాము ప్రాణాధికంగా అర్చించుకునే రాముడి
జన్మస్థలాన్ని కోల్పోవడం హిందువులను తీవ్రంగా గాయపరిచింది. ఈ ఐదు శతాబ్దాలుగా ఎన్నో
అవమానాలను ఎదుర్కొని న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా తమ రాముడి జన్మస్థానంపై హక్కును
గెలుచుకున్నారు హిందువులు. తమ ఆదర్శమూర్తి జన్మస్థానంలో అపురూపమైన ఆలయం
నిర్మించుకున్నారు. వందల యేళ్ళ నిరీక్షణకు ఫలితంగా ఎట్టకేలకు జనవరి 22న
భవ్యరామమందిరంలో బాలరాముడు కొలువు తీరిన క్షణాలను భావోద్వేగంతో గుండెల్లో
పెట్టుకున్నారు.
ఐదువందల యేళ్ళ క్రితం ఆక్రమించిన పరాయిమతస్తులు
ఇక్కడి ప్రజలను కత్తితో బెదిరించి ముస్లిములుగా మార్చారు. వారి బుద్ధినీ మార్చి,
హిందువుల పట్ల శత్రుత్వం, ద్వేషభావం పెంచారు. ఇప్పుడు ఆధునిక భారతంలో ఉన్న
ముస్లిములలో అత్యధికులు అదే ఆధిపత్యభావంతో హిందువులపై విద్వేషాన్ని
వెళ్ళగక్కుతున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా అది హిందువుల ఆత్మగౌరవానికి
ఉపయుక్తం కాలేదు. తమకంటూ రెండు దేశాలను భారత భూభాగం నుంచి చీల్చుకుపోయారు. అది
కూడా సిరపోదు, దేశం మొత్తాన్నీ ఇస్లామీకరణ చేయాలని భావిస్తున్నారు. ధర్మం పట్ల
పట్టింపే లేని ప్రభుత్వాల నేతృత్వంలో ముస్లిములు ఆడింది ఆటా పాడింది పాటాగా
నడిచిపోయింది. ఆ అహంభావానికి గత పదేళ్ళుగా అడ్డుకట్ట పడింది. ఇప్పుడు రామజన్మభూమిలో
రామమందిరం నిర్మాణమవడంతో మళ్ళీ వాళ్ళ పౌరుషం పేట్రేగిపోయింది. మాకింద అణిగిమణిగి
ఉండవలసిన హిందువులు పండుగ చేసుకుంటారా అన్న ఉక్రోషం ముదిరిపోయింది. హిందువులు
ప్రశాంతంగా చేసుకుంటున్న శోభాయాత్రలపై ముస్లిములు దాడులకు పాల్పడ్డారు.
హిందువులు పండుగలు చేసుకుంటున్నారంటే చాలు,
కొందరు ముస్లిములకు ఒళ్ళమీద తేళ్ళూ జెర్రులూ పాకుతున్నట్టుంటుంది. ఏదో ఒకరకమైన
దాడులు చేసి హిందువుల పండుగ ఆనందాన్ని నాశనం చేస్తూ ఉంటారు. జనవరి 22 అయోధ్యలో
నూతన రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ రోజు సైతం అలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు.
మహారాష్ట్రలో 36 గంటల వ్యవధిలో 3 గొడవలు జరిగాయి.
హిందువులు శోభాయాత్ర చేసుకుంటుంటే వాళ్ళ ఆస్తులకు నిప్పుపెట్టారు. వారి వాహనాలపై
రాళ్ళదాడులు చేసి ధ్వంసం చేసారు. మీరా భాయందర్, పన్వేల్, శంభాజీనగర్‌లలో ఈ
దుర్మార్గాలకు ఒడిగట్టారు. ఆ మూఢు ఘటనలలోనూ పోలీసులు సుమారు 80 మందిని అరెస్ట్
చేసారు.
గుజరాత్‌లోని వడోదర, మెహసానా ప్రాంతాల్లో
రామభక్తుల శోభాయాత్రల మీద ముస్లిము మూకలు రాళ్ళదాడి చేసాయి. హిందూభక్తులతో పాటు ఆ
హింసాకాండను ఆపడానికి వచ్చిన పోలీసులు సైతం గాయపడ్డారు. ఆ ఘటనకు సంబంధించి
పోలీసులు 16మందిని అరెస్ట్ చేసారు.
ఉత్తరప్రదేశ్ కుశీనగర్ జిల్లా కసయా పోలీస్
స్టేషన్ పరిధిలోని టోలాబజార్‌లో హిందువులు బాణాసంచా కాలుస్తూ శోభాయాత్ర చేపట్టారు.
దాంతో ఆగ్రహించిన ముస్లిములు యాత్ర చేస్తున్న హిందువులపై దాడికి పాల్పడ్డారు.
రాళ్ళదాడి చేయడమే కాకుండా హిందువుల వాహనాలను సైతం ధ్వంసం చేసారు. ఆ ఘటనలో పోలీసులు
నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ ఆజంగఢ్‌లో జహానాగంజ్ కస్బాలో
జరుగుతున్న శోభాయాత్రను ముస్లిములు చుట్టుముట్టి నిలిపివేసారు. శోభాయాత్ర కోసం
నిర్వహిస్తున్న డీజేని ఆపివేయించారు. ముస్లిముల దాడిలో పలువురు హిందువులకు
గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
బిహార్ దర్భంగా జిల్లాలో సింహవాడా పీఎస్
పరిధిలోని భపురా గ్రామంలో ప్రజలు చేపట్టిన శోభాయాత్రపై ముస్లిములు రాళ్ళు
రువ్వారు. రెండు మోటర్ సైకిళ్ళు, సంగీతవాద్యాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఊహించని ఈ
దాడి వల్ల శోభాయాత్రలో పాల్గొన్న పలువురికి గాయాలయ్యాయి.
బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో శోభాయాత్ర మీద
ముస్లిములు రాళ్ళు, తల్వార్లతో దాడి చేసారు. హిందువుల ఇళ్ళపైనా విరుచుకుపడ్డారు. దాంతో
యాత్రలో పాల్గొంటున్న హిందువులు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు
చెల్లాచెదురైపోయారు.
జార్ఖండ్ గిరిధ్ పట్టణంలో శ్రీరామ శోభాయాత్రపై
జిహాదీ ముస్లిములు రాళ్ళదాడి చేసారు. ఆ దాడిలో పలువురు భక్తులు గాయాలపాలయ్యారు. ఈ
ఘటనకు సంబంధించి పోలీసులు మొహమ్మద్ జాబిర్ అనే యువకుణ్ణి అరెస్ట్ చేసారు.
జార్ఖండ్‌లోనే ఆజాద్ నగర్ వద్ద ఆర్ఎస్ఎస్
కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. రోహిత్ మహతో అనే యువకుణ్ణి చంపేందుకు
ప్రయత్నించారు. దాంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
కర్ణాటకలోని బెళగావిలో కూడా ముస్లిం మూకలు, హిందూ
భక్తులు చేసుకుంటున్న శోభాయాత్ర మీద రాళ్ళదాడులు చేసాయి. పరిస్థితి చేయిజారిపోవడంతో
కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ రెండు ప్లాటూన్ల బలగాలను అక్కడ మోహరించారు.
కర్ణాటక శివమొగ్గ పట్టణంలో శోభాయాత్ర
జరుపుకుంటున్న హిందువుల మధ్యకు ఒక ముస్లిం మహిళ చొరబడి అల్లాహో అక్బర్ అంటూ
నినాదాలు చేసింది. హిందువులను నిందిస్తూ దుర్భాషలాడింది. పోలీసులు ఆమెను అదుపులోకి
తీసుకున్నారు.
పశ్చిమ బెంగాల్ రాజధాని
కోల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ విద్యార్ధులు అయోధ్య ప్రాణప్రతిష్ఠ
కార్యక్రమాన్ని టీవీలో లైవ్ చూస్తున్నారు. అయితే అక్కడ వామపక్షాలకు చెందిన ఎస్ఎఫ్ఐ
మూకలు చెలరేగిపోయాయి. దాంతో అక్కడ లైవ్ స్ట్రీమింగ్ నిలిపివేసారు. ఫలితంగా గొడవ
జరిగింది. ఆ గొడవలో ఏబీవీపీ విద్యార్ధులు పలువురు గాయాల పాలయ్యారు. వారిని
ఆస్పత్రుల్లో చేర్పించారు.