పొత్తులపై
కాంగ్రెస్కు ఆప్ కూడా షాకిచ్చింది. ఇండీ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆమ్ ఆద్మీ
పార్టీ(ఆప్) కూడా సొంతంగా పోటీ చేసి గెలుస్తామని ప్రకటించింది. 13 లోక్ సభ సీట్లలో
పోటీ చేసి విజయం సాధిస్తామని ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ తెలిపారు.
పశ్చిమ
బెంగాల్ లో టీఎంసీలా ఆప్ కూడా ఎన్నికలకు ఒంటరిగా వెళుతుందా అని మీడియా ప్రతినిధులు
ప్రశ్నించగా కాంగ్రెస్తో అలాంటిదేమీ లేదన్నారు. కాంగ్రెస్ తో ఎలాంటి సంబంధం
లేదని, 13 స్థానాల్లోనూ తమ పార్టీ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.
ఒంటరిగా
పోటీ చేయాలనే ఆప్ పంజాబ్ శాఖ నిర్ణయాన్ని కేజ్రీవాల్ కూడా ఆమోదించినట్లు సంబంధిత
వర్గాలు తెలిపాయి.
పంజాబ్
లో పొత్తులకు కాంగ్రెస్ కూడా సుముఖంగా లేదని హస్తం నేతలు అంటున్నారు.
పంజాబ్
కాంగ్రెస్ భవన్ లో వార్ రూమ్ ఏర్పాటు చేసిన హస్తం నేతలు, ఎన్నికల వ్యూహాన్ని
సిద్ధం చేశారు. 13 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ ఇప్పటికే సమన్వయకర్తలను
నియమించింది.